Friday, 25 October 2013

bhai review


భాయ్ - చిత్ర కథ
11:26 am : డేవిడ్ ఎసిపిని కిడ్నాప్ చేస్తాడు. కానీ భాయ్ అతనిని రక్షిస్తాడు. ఇక్కడ దేవీ బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. లాస్ట్ ఫైట్ అచ్చం మాస్ సినిమాను మరిపిస్తున్నట్లు ఉంది.

11:22 am : జేమ్స్ (సోను సూదు) నెమ్మది నెమ్మదిగా రియలైజ్ అవుతాడు. తన బ్రదర్ మర్డర్ వెనుక నిజా నిజాలు కిడ్నాప్ విషయాలు తెలుసుకుంటాడు. భవాని వెనక్కి వస్తాడు.

11:15 am : రెడ్ హాట్ సుందరి హంస నందిని కాస్త ఎంట్రీ థియేటర్ల కూర్చున్నవారి కాస్త మజా ఇచ్చినట్లుంది.

10:55 am : 20 సంవత్సరా ఫ్లాష్ బ్యాక్. వాళ్ల ఫ్యామిలిని రక్షించడానికి బాయ్ గా అవతారమెత్తుతాడు. ఇక్కడో ఫైటింగ్ సీన్ చాలా ఫర్ ఫెక్ టా కొరియోగ్రాఫ్ చేశారు.

10:35 am : నవ్వుల రారాజు బ్రహ్మానందం ఎంట్రీ. థియేటర్లో నవ్వులే నవ్వులు. రిచా-నాగ్ ల మధ్య సన్నివేశాలు అంతగా ఆకర్షించలేక పోతున్నాయి.

10:32 am : హే పిల్లా పిల్లా పాట చాలా బాగుంది. రిచా ఈ పాటలో చాలా అందంగా కనబడుతుంది. మొత్తానికి కొరియోగ్రఫి కూడా బాగుంది.

10:28 am : భాయ్ తన కుంటుంబానికి హాని చేసిన వారిని క్లోస్ చేయడానికి చూస్తాడు. కానీ మధ్యలోనే తన ఇంటికి రిటన్ వస్తాడు.

10:25 am : ఇంటర్ వెల్ తర్వాత ఫ్యామిలో ఒరియెంట్ సీన్స్.. ట్విస్ట్. ఫ్లాష్ బ్యాక్. డేవిడ్ (ఆషిష్) జేమ్స్ (సోనూసూద్) హైదరబాద్ వెళుతారు. అర్జున్ (ప్రసన్న)అనే పోలీస్ ఆఫీసర్ ను చంపడానికి

..... విశ్రాంతి....

10:12 am : ఇంటర్ వెల్ ముందు మంచి ట్విస్ట్.. భాయ్ ఫ్యామిలి సెంటిమెంట్ సీన్స్ ఎంటర్ అవుతాడు. ఇక్కడ నుంచి ఫన్నీసీన్స్ మొదలు..

10:00 am : భాయ్ ని రిచా ప్రపోజ్ చేస్తుంది. ఇక్కడ పాట ‘ అయ్యబాబోయ్ నా మనసే’ ఫోక్ సాంగ్ చాలా బాగుంది. కానీ కొరియోగ్ర ఫి చాలా సింపుల్ గా ఉంది.

9:55 am : భావానీ (రాహుల్ దేవ్) భాయ్ ని అంతం చేయడానికి ప్లాన్ వేస్తాడు. కానీ వాళ్ల గ్యాంగ్ ను ఫినిష్ చేస్తాడు భాయ్. ఇక్కడ ట్విస్ట్ బాగుంది.

9:46 am : ప్రీ పేడ్, పోస్ట్ పేడ్ కనెక్షన్ల సీక్వెన్స్ లో అడిగి మరీ ఫైట్ చేయడం చాలా ఫన్నీగా ఉంది. ఫైటింగ్ కొరియోగ్రఫీ నాట్ బ్యాడ్

9:39 am : ‘నెమ్మది నెమ్మదిగా’ మెలోడీ సాంగ్ వ్యూజువ్ గా బాగుంది. కొరియోగ్రఫి కూడా నీట్ గా ఉంది. నాగ్ స్టెప్పులు స్లోగా స్టైలిష్ గా ఉన్నాయి.

9:33 am : వదిలేయ్ బాబ (రఘు) సీన్స్ బాగా డ్రాగ్ చేసినట్లు అనిపిస్తుంది.

9:30 am : హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ ఎంట్రీ చాలా క్యూట్ గా ఉంది. భాయ్ చూసిన మొదటి సారే నాగ్ కు ఎట్రాక్షన్ అయిపోతుంది.

9:25 am : భాయ్ హైదరాబాద్ వదిలి వెళుతాడు.. కారణం అండర్ గ్రౌండ్ మా ఫియా ను అంతమొందించడానికి. ఎం.ఎస్. నారాయణ తాగుబోతులా ఎంట్రీ చాలా ఫన్నీగా ఉంది.

9:23 am : నేను చంపాలని ఫిక్స్ అయ్యా..కానీ సిక్స్ అయ్యింది. బతికిపోయావ్ డైలాగ్ తో భాయ్ టైటిల్స్ చాలా కలర్ ఫుల్ గా ఉంది. తర్వాత నటాలియా కౌర్ ఎంట్రీ చాలా సెక్సీగా ఉంది.

9:15 am : భాయ్ తో పెట్టుకుంటే చావుకు తాత్కల్ టికెట్ తీసుకున్నట్టే ... డైలాగ్ తో భాయ్ (నాగార్జున) ఎంట్రీ థియేటర్లో సందడి మొదలైంది.

9:13 am : డేవిడ్ (ఆశిష్ విద్యార్థి )ని సోను సూద్, అజయ్ కిడ్నాప్ చేస్తారు. కానీ డేవిడ్ వాళ్లకు డాన్ గురించి లెసన్ చెబుతాడు.

9:10 am : హాయ్! గుడ్ మార్నింగ్ ఏపీ హెరాల్డ్.కమ్ రీడర్ప్ అక్కినేని నాగార్జున నటించిన భాయ్ సినిమా ట్వీట్ రిప్వూకి మీకు స్వాగతం.

No comments: