Friday, 3 May 2013

pavan kalyan maheshbabu trivikram-mahesh babu dailogues



పవన్-త్రివిక్రమ్ సినిమాలో మహేష్ బాబు డైలాగ్స్ ఇవే..!
పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ ల కలయికలో రూపొందుతున్న సినిమాలో మహేష్ బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్న గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఈ పాత్ర రెండు నిమిషాల పాటు సాగుతుందని సమాచారం. కాగా, ఈ సినిమా లో మహేష్ బాబు పోషించే పాత్ర గురించి మరికొన్ని అసక్తికరమైన విషయాలు తెలిశాయి.

ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ స్నేహితుడుగా  మహేష్ బాబు నటిస్తున్నాడు. హీరో పవన్ కళ్యాణ్ - హీరోయిన్ సమంత ల వివాహం జరిగే దృశ్యంలో మహేష్ బాబు కనిపిస్తాడు. వివాహం చేసుకుంటున్న తన మిత్రుడు పవన్ కళ్యాణ్ ను మిత్ర బృందంతో కలిసి ఆటపట్టిస్తుంటాడు. ఈ సందర్భంలో మహేష్ బాబు పాత్ర కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పదునైనా సంభాషణలు రాసాడు. ఆ డైలాగులు ఇవే...

(మహేష్ బాబు ఈ డైలాగులు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చెబుతుంటాడు..)

‘అన్నయ్యా... పెళ్లి అదిరింది, తరువాత నీకు అంతా జల్సానే..’

‘మిత్రమా.. నీకు తిక్కఉందని మాకు తెలుసు. కానీ, ఆ తిక్క అక్కడ మాత్రం చూపించకు’

‘అమ్మాయి సక్కగ ఉంది. కూర బాగోలేదని కాపురం సెడగొట్టుకోకు’

‘మీ ఫ్యామిలీ నుంచి ఇంకొ కొత్త హీరో రావాలి’

ఇలాంటి డైలుగులతో పవన్ కళ్యాణ్ విహహ దృశ్యంలో మహేష్ బాబు కనువిందు చేయనున్నాడు.

No comments: